తన పొలంలోకి రాగానే డమరూ గాడిద దృష్టి గుమ్మడి తీగల పై పడింది. గుమ్మడి కాయలు తక్కువగా ఉన్నట్లు గమనించి వాటిని లెక్కించాడు.
'అయ్యో, ఈ రోజు మళ్లీ ఒకటి తక్కువైంది.రోజూ నా గుమ్మడి కాయలను ఎవరో దొంగిలిస్తున్నారు?' అనుకున్నాడు మనసులో.
చీకూ, మీకూ డిటెక్టివ్ల సహాయం తీసుకోవడానికి వెళ్లి వారితో సమస్య చెప్పుకున్నాడు.
“ఇది చాలా తీవ్రమైన సమస్య. బాధపడకు.కష్టమైనదేమీ కాదు. ఎవరైనా సరే చీకూ, మీకూల నుంచి తప్పించుకోవడం అసాధ్యం" అన్నాడు చీకూ కుందేలు. డమరూ వారిని పొలానికి తీసుకుని వెళ్లాడు.
“నీ పొలం చుట్టూ కంచె ఉంది కాబట్టి ఏ దొంగా పొలంలోకి ప్రవేశించలేడు" చెప్పాడు.
చీకూ.
“కంచె కింద లోపలికి రావడానికి ఒక చిన్న దారి ఉంది" పొలంలో ఒక స్థలం చూపించాడు డమరూ.
“సరే, డమరూ, నీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా?” అడిగాడు చీకూ.
“బ్యాడీ నక్క నా గుమ్మడి కాయలు దొంగిలించి ఉండవచ్చు. నా పొలంవైపు వచ్చిన ప్రతిసారి అతడు వాటిని ఆశగా చూసేవాడు" జవాబు ఇచ్చాడు డమరూ.
“అది సాధ్యం కాదు. బ్యాడీ లావుగా ఉంటాడు.
కంచె కింది నుంచి అతడు లోపలికి రాలేడు” చెప్పాడు చీకూ.
“మరి దొంగ ఎవరు?" అడిగాడు డమరూ కంగారు పడుతూ.
“మేము కనిపెడతాం” చెప్పాడు మీకూ.
“ఒక పెన్ను, పేపర్ తీసుకో మీకూ, మనం డమరూ పొలం నుంచి గుమ్మడి కాయలను దొంగిలించే అవకాశమున్న వారి జాబితా తయారుచేయాలి” చెప్పాడు చీకూ పాకెట్లోంచి పెన్, నోట్బుక్ తీసాడు మీకూ.
“నేను రెడీ” అన్నాడు మీకూ.
“మొదట జంబో ఏనుగు పేరు రాయి.” "జంబో పేరు ఎందుకు?” అడిగాడు డమరూ.
“తొండం సహాయంతో జంబో ఏనుగు పొలంలోంచి గుమ్మడి కాయలను తీసుకెళ్లగలడు" వివరించాడు చీకూ.
తర్వాత పేరు జాకీ జిరాఫీ. అతడు పొడవాటి మెడ సహాయంతో పొలంలో అడుగుపెట్టకుండానే గుమ్మడి కాయలు తీసుకోగలడు" మీకూ చెప్పగానే అవునంటూ చీకూ తల ఊపాడు.
“చివరగా జంపీ పేరు రాయి” అన్నాడు చీకూ.
మీకూ, డమరూలు షాక్ తిన్నారు.
“జంపీ ఎందుకు?, అతనికి తొండం లేదు.
పొడవైన మెడ లేదు" ఆశ్చర్యపోతూ అడిగాడు డమరూ.
This story is from the August 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.