మధ్యాహ్న సమయంలో నదిలో నీళ్లు తాగి మోంటీ కోతుల బృందం తర్వాతి గమ్యంవైపు బయలుదేరింది. ఆ బృందం వెళ్లగానే డోడో, డానీ జింకలు నది వద్దకు చేరుకున్నారు. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోబోతున్నప్పుడు, టోనీ కోతి స్పృహ లేకుండా పడి ఉండటం వారు చూసారు.
“అతనికి ఏమైంది? అపస్మారక స్థితిలో ఉన్నాడనిపిస్తోంది. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. ఎవరితోనో పోట్లాడి ఉంటాడు. అందుకే ఈ పరిస్థితి ఏర్పడింది" అన్నాడు డోడో.
“ఏం చేద్దాం?” అడిగాడు డానీ.
అతన్ని కదిలించి చూసారు కానీ టోనీ స్పృహలో లేడు.
“డోడో, నదికి వెళ్లి కొన్ని నీళ్లు తీసుకురా. తాగితే అతని పరిస్థితి మారుతుందేమో...”.
"ఎలా తీసుకు రావాలి?”.
“నదిలో నీళ్లు పట్టుకోడానికి ఏదైనా వెతుకు. తప్పకుండా దొరుకుతుంది” జవాబు ఇచ్చాడు. డానీ.
నదివైపు పరుగెత్తాడు డోడో. డానీ చెప్పింది నిజమైంది. నది ఒడ్డున ఒక వెదురు గొట్టం కనిపించింది. దాన్ని నీటితో నింపుకుని వెంటనే పరుగెత్తుకొచ్చాడు. టోనీ ముఖంపై కొన్ని నీళ్లు చల్లి కొంచెం తాగించాడు. కొద్దిసేపటికి అతనికి స్పృహ వచ్చింది.
“నేను ఎక్కడ ఉన్నాను?” అని అతడు అడిగాడు.
"భయపడకు. చెట్టు కింద నువ్వు స్పృహ తప్పి పడిపోయి ఉన్నావు. నీకు ఇలా చేసిందెవరు?” అడిగాడు డానీ.
“మోంటీ కోతి.”
“ఎందుకు ఏమైంది?” అన్నాడు డోడో.
“మా బృందం అడవిని విడిచి వెళ్లింది. నేను మాత్రం వారితో వెళ్లడానికి ఇష్టపడలేదు. అందుకే ఇక్కడే ఉండిపోయాను. మోంటీ బృందం ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. నన్ను వదిలించుకోవాలని చూస్తోంది. అందుకే ఈ పరిస్థితిలో ఉన్నాను.”
డోడో, డానీలతో మాట్లాడిన తర్వాత టోనీకి మంచిగా అనిపించింది.
“నువ్వు ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు.నీ బృందం దగ్గరకు వెళ్లిపో" డోడో సలహా ఇచ్చాడు.
“వారు చాలా దూరం వెళ్లారు. నేను వారిని చేరుకోలేను. కొంత సమయం తర్వాత తిరిగి వస్తారు.
అప్పుడు వారితో కలుస్తాను. సరే, నేను వెళ్తాను” అన్నాడు టోనీ.
“జాగ్రత్త. గాయాలకు చికిత్స చేయించుకో”.
“అలాగే. రేపు కొన్ని మూలికలు సేకరించి వాటిని మెత్తగా నూరి నా గాయాలకు రాస్తాను”.
This story is from the August 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.