ఎనిమిదేళ్ల అను తన తల్లి లతతో కలిసి ఒక గ్రామంలో నివసిస్తుండేవాడు. అతని తండ్రి రెండేళ్లక్రితం ఒక ప్రమాదంలో చనిపోయాడు. అన్షును పెంచడానికి అతని తల్లి లత పగలు రాత్రి శ్రమిస్తూ అతని కోరికలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తుండేది. అదే గ్రామంలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతుండేవాడు.
ఒక రోజు అతను తన క్లాస్మేట్స్ రాహుల్, శ్యామ్, బ్రిజ్, అనిల్లలతో కలిసి ఉదయం పాఠశాలకు వెళ్తున్నాడు. దారిలో పక్కింటి గోపీ దాదీకి చెందిన పెద్ద పొలం గుండా నడుచుకుంటూ వెళ్లారు. అది వర్షాకాలం.
అక్కడ తీగలు వేసారు.
"దాదీ పొలంలో చాలా దోసకాయలు ఉన్నాయి. మనం కొన్నింటిని కోసుకుందాం” అన్నాడు రాహుల్.
“మనల్ని చూస్తే దాదీకి చాలా కోపం వస్తుంది. తను
తోటని దగ్గరుండి చూసుకుంటున్నది" శ్యామ్ బదులిచ్చాడు.
“మనం ఐదుగురం. దాదీ ఒంటరిగా ఉన్నది.
మనం తోటలోకి వెళ్లి దోసకాయలు కోసేటప్పుడు అన్షు కాపలాగా ఉంటాడు. సరేనా? అన్షూ”.
అనుకి వారితో కలిసి దొంగతనం చేయడం ఇష్టం లేదు. తప్పుడు పనులు చేయవద్దని అతని తల్లి ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉంటుంది.
అతను నిశ్శబ్దంగా ఉండడం చూసి బ్రిజ్ "అతిగా ఆలోచించకు అను. దోసకాయలు కోసుకోవడం నిజంగా దొంగతనం కాదు. నువ్వు ఎవరినైనా అడిగి తెలుసుకో” అన్నాడు.
దీంతో అను కొంచెం కుదుటపడ్డాడు. ఒకరి పొలంలో నుంచి దోసకాయలు తీసుకోవడం దొంగతనంగా పరిగణించబడదని అతని మామ కూడా చెప్పాడు గతంలో. నలుగురు స్నేహితులు దోసకాయలు కోయడానికి దాదీ తోటకి చేరుకున్నారు. అను పక్కకు నిలబడి చూస్తూ ఉండిపోయాడు. వాళ్లు రెండు దోసకాయలు కోసుకున్నారో లేదో ఇంతలో దాదీ అరుపు వినిపించింది. దాంతో అన్షు “పరుగెత్తండి...పరుగెత్తండి, దాదీ వస్తున్నది!” అన్నాడు.
నలుగురూ బ్యాగులు పట్టుకుని అక్కడి నుంచి స్కూల్ వైపు పరుగెత్తారు. అన్షు మాత్రం వెనకే ఉండిపోయాడు. దాదీ తనను తిట్టదని అతను అనుకున్నాడు. ఎందుకంటే ఆమె తరచుగా వాళ్ల ఇంటికి వస్తూ ఉండేది. అంతేకాదు అతనన్నా, అతని తల్లి లత అన్నా దాదీకి ప్రేమ. ఎప్పుడూ ఆప్యాయతతో పలకరిస్తూ ఉండేది.
దాదీ అతన్ని పట్టుకుని “దొంగతనం చేయడానికి నీకు సిగ్గు లేదా అన్షూ?” అని అడిగింది.
“నేను దోసకాయలు తీసుకోలేదు దాదీ".
This story is from the October 2024 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2024 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్