నాగావళి నదికి ఒడ్డున సంగంవలస అనే పెద్ద గ్రామమొకటి ఉంది. అక్కడే సువర్ణముఖి, వేగావతి నదులు నాగావళిలో కలుస్తున్నాయి. అందుకే ఆ ప్రాంతాన్ని త్రివేణీసంగమం అంటారు. ఆ ప్రాంతమంతా ప్రాకృతికశోభతో అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండల నడుమ గుండా ప్రవహించే నదుల గలగలల సోయగాలు యాత్రికులను కనువిందు చేస్తుంటాయి. ఆ నదులకు ఆనుకుని ఉన్న పంటపొలాలు పచ్చదనంతో పలకరిస్తుంటాయి.అంత అందమైన సంగంవలస గ్రామంలో రాఘవవర్మ ఏకైక భూస్వామి.గతంలో వారి పూర్వీకులే రాజులూ జమీందారులూను. అక్కడ కొంతమేర శిధిలావస్థలో ఉన్న కోట ఒకటి ఉంది. ఆ కోటలో ఓ ప్రక్కన ఒక అధునాతన భవనం ఉంది. అదే రాఘవవర్మ నివాసం.
వర్మ సంగంవలస నియోజకవర్గానికి గతసారి జరిగిన సాధారణ ఎన్నికలలో శాసనసభ్యునిగా పోటీచేసి ఓడిపోయారు. గతంలో వారి తాత మాధవవర్మ మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత వారి తండ్రి విక్రమవర్మ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు మంత్రిగా కూడా పదవిని అలంకరించారు.ఒకప్పుడు వారి తాతదండ్రుల్లా నేడు వీరికి గెలుపేమి సునాయాసం కాదు.ఎందుకంటే ఆ నియోజకవర్గంలో వారి సామాజిక వర్గం ఉండేది.బహుస్వల్పమే. నేడు బహుజన సామాజిక వర్గాలలో రాజకీయ చైతన్యం పెరిగింది. ఆయా వర్గాలు ఐక్యంగా పనిచేయడంతో జనాభాపరంగా తక్కువ ఉన్న అగ్రవర్ణాల గెలుపేమి ఇంతకుమునుపులా సులువు కాదు. అందువల్లనే వర్మ గత ఎన్నికల్లో పోటీచేసి ఓ సామాన్యుడి చేతిలో ఓడిపోయాడు.ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న బహుజన వర్గానికి చెందిన ఓ సామాజిక వర్గం రాజకీయాలను బాగా శాసిస్తున్నది. అందువల్ల అగ్రవర్ణ వర్గాలకు చెందిన రాఘవవర్మ గెలుపు ఆనాడు అసాధ్యమైంది. కానీ వర్మ ఈసారైనా గెలిచి ఎమ్మెల్యే కావాలని తహతహలాడుతున్నాడు. ఈసారి ఎన్నికల్లో ఎలాగో ఒకలాగా విజయాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు పోతున్నాడు.డబ్బు అంతకు పదింతలు విరజల్లాలనే ఆలోచనతో ఉన్నాడు. తన తండ్రీతాతల్లా గెలిచి తన సత్తా ఏంటో అందరికీ చాటాలనుకుంటున్నాడు.అయితే ఒకవైపు తనకు గెలుపు సాధ్యం కాకపోవడం పట్ల బాధతో ఉన్నాడు.
This story is from the December 17, 2023 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 17, 2023 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
1.12.2024 నుంచి 7.12.2024 వరకు
వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి.
'మెకానిక్ రాకీ'
కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తీసిన ఈ సినిమాలో కథ ఏమిటి? కథనం ఎలా ఉంది?
'లక్కీ భాస్కర్'
దుల్కర్ సల్మాన్కు మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది
ఆదరణ కొరవడి అంతరించిపోతున్న బాషలు
భావ వ్యక్తీకరణకు మూలం భాష. భాషలేవీ మనుగడలో లేని ఆదిమానవుల కాలంలో, వారు సౌంజ్ఞలు చేయడం, అగ్ని, పొగ రాజేయడం, తప్పెట్లపై దరువు వేయడం, నోటితో ధ్వనులు చేసి తమ ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరిచేవారని అధ్యయనకారుల అభిప్రాయం.
ముఖానికి బెల్లం రాస్తే చాలు, వయసు తగ్గడం ఖాయం..!
పంచదారకు ప్రత్యామ్నాయంగా ఈ బెల్లాన్ని వాడుతూ ఉంటాం. కానీ.. ఈ బెల్లం మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా?
తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ గాలి నాణ్యత కారణంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు
చలికాలం ప్రారంభమై నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
వేమన శతకం
వేమన శతకం
సూర్య find the difference
find the difference
సూర్య sudoku
sudoku
సూర్య Color by number
Color by number