భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. బంగారం భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. శతాబ్దాల నుండి ఇది సంపద, గౌరవం, సాంప్రదాయ సాంస్కృతిక విలువలకు చిహ్నంగా నిలిచింది. వివాహ వేడుక లలో, ముఖ్యమైన పండుగలలో బంగారు నగలను బాగా వాడతారు. వివాహాలలో బంగారపు ఆభరణాలు, సంపదను కలిగిన సంకేతంగా మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆర్థిక భద్రతగా కూడా భావించబడుతున్నాయి.
గత కొన్నేళ్ళలో భారతదేశంలో బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు వరుసగా చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక అస్థిరతలు, మరియు రూపాయి విలువ ప్రభావం, దీపావళి వంటి పండుగల సమయంలో, బంగారం కొనుగోలు దాదాపు ప్రతి ఇంట్లో ఒక సాంప్రదాయంగా ఉంది. దీని కారణంగా, పండుగలకు ముందు, పసిడి ధరలు సాధారణంగా పెరుగుతుంటాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విదేశీ మారక నిల్వలను బంగారంలో నిల్వ పెట్టడంలో ఆసక్తి చూపుతోంది. ఈ విధానంతో భారతదేశం ఆర్థికంగా స్థిరత్వం పొందుతుంది.బంగారం ఒక విశ్వసనీయ సంపదగా ఉండటం వల్ల దీని నిల్వలు మరింత భద్రతనిస్తాయి. ఇంకా భారతదేశం గతంలో ఇంగ్లాండ్ బ్యాంక్ వద్ద నుండి బంగారం విడిపించుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన పెంచుకుంది, అయినప్పటికీ మరికొంత భాగం ఇంకా ఉంది.
దీపావళి తరువాత, సాధారణంగా బంగారం. ధరలు స్థిరంగా లేదా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు. చమురు ధరలు, అమెరికా వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కావున దీపావళి తరువాత ధరలు కొంత తగ్గడం లేదా స్థిరంగా ఉండొచ్చునని అంచనా! అంటే అంతగా పెరగకపోవచ్చు.
ఇతర రంగాలలో కూడా బంగారం వినియోగం వుంది. బంగారం కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, అనేక రంగాలలో ఉపయోగపడుతుంది:
* మెడికల్ రంగంలో డెంటల్ ఫిల్లింగ్స్, శస్త్ర చికిత్సల్లో ఉపయోగిస్తారు.
* ఎలక్ట్రానిక్స్ రంగంలో బంగారం అతి సున్నితమైన వైర్లు, కండక్టర్ల తయారీలో వాడతారు.
* ఏరోస్పేస్ అంతరిక్ష పరిశోధనలో బంగారం ఉపయోగం ఉంది, ముఖ్యంగా తాప నియంత్రణకు.
* ఎలక్ట్రికల్ ఉపకరణాల్లో కంప్యూటర్ చిప్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ లాంటి రంగాల్లో కూడా బంగారం ఉపయోగం అధికంగా ఉంది.
భవిష్యత్తులో బంగారం ప్రాధాన్యత
This story is from the November 17, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 17, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు