పావన కృష్ణానది మహారాష్ట్రలో ఉద్భవించినది మొదలు ఆంధ్రప్రదేశ్‌లో సాగర సంగమం చేసేవరకు ప్రవాహ మార్గాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు తన తీరాలను ఆధ్యాత్మిక క్షేత్రాలుగా రూపొందించుకొన్నది.
ఈ కారణంగా కృష్ణా తీరాలలో హిందూ ఆలయాలే కాదు బౌద్ధుల, - జైనుల నివాస ఆనవాళ్లు కూడా పెక్కుచోట్ల కనిపిస్తాయి. వివిధ దేవీ దేవతలు స్థిరవాసాలైన ఈ ఆలయాలలో ఒకటి విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపైన కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి.
పురాణ గాథ
శ్రీ మల్లేశ్వర స్వామి సమేతంగా సమస్త శివ పరివారం కొలువైన ఈ క్షేత్ర పురాణగాథ తొలి యుగం నాటిదిగా తెలుస్తోంది. ద్వాపర యుగంలో పాండవ మధ్యముడైన అర్జునునికి కైలాసనాథుడైన పరమశివునికి యుద్ధం జరిగిన స్థలం ఇదేననీ, ఆ కారణంగా విజయవాటిక అన్న పేరు వచ్చింది అంటారు.కాలక్రమంలో విజయవాడ మారిందని చెబుతారు. కిరాతక రూపంలో ఉన్న మహేశ్వరునితో పోరు సల్పి అర్జునుడు 'విజయ' నామం పొందిన ప్రదేశం ఇదేనని పురాణాలు పేర్కొంటున్నాయి. పరమేశ్వరుని నుండి పాశుపతాస్త్రం పొందిన అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వత పాదాల వద్ద శ్రీ విజయేశ్వర స్వామిని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా శ్రీ బ్రహ్మాస్త్రాదేవి సన్నిధి ఉండటం విశేషం.
తెలుగు రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ. ప్రతిరోజూ వేలాదిగా దూర ప్రాంతాల నుండి సైతం భక్తులు వస్తుంటారు.పర్వదినాలలో, నవ రాత్రులలో, భవాని దీక్షల సమయంలో ఆ సంఖ్య లక్షలలో ఉంటుంది. వ్యాపారానికి, విద్యకు ప్రసిద్ధికెక్కిన విజయవాడ నగరంలో మరెన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో ఇంద్రకీలాద్రి పర్వత పాదాల వద్ద ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఒకటి.
విజయవాడ వన్ టౌన్ ఉన్న ఈ పురాతన ఆలయం పాత శివాలయంగా ప్రసిద్ధి. పర్వత పాదాల వద్ద ఉండటం, పాండవ మధ్యముని పూజలు అందుకోవడంతో గతంలో 'పాద శివాలయం' అని పిలిచేవారట. కాలక్రమంలో పాత శివాలయంగా పిలవబడుతోంది. కొన్ని వందల సంవత్సరాల పురాతన చరిత్ర, పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన దేవాలయాన్ని పాత శివాలయం అని పిలవడం సమంజసం. విశేష పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయం శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవాలయం.
ఆలయ ప్రత్యేకతలు
This story is from the December 15, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 15, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్‌తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు