![దూరపు చదువులు మెరుపు](https://cdn.magzter.com/1397201783/1707599439/articles/b3tDcGeFH1707640884694/1707642256171.jpg)
విదేశాల్లో చదువు కోవాలనే చాలా మంది భారతీయ విద్యార్థుల కల.ఇటీవలి సంవత్సరంలో అధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు తమ ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు క్యూ కడుతున్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో చదువుకోవాలనే తపన, భారతదేశంలో యువతను ఆకర్షిస్తోంది.విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటానికి కారణాలు ఏమిటి? 2017 నుండి దాదాపు 30.13 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశీ ఉన్నత విద్యను అభ్యసించారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
కారణాలు పరిశీలిస్తే నాణ్యమైన విద్య, బోధన, మెరుగైన కోర్సులు, అత్యాధునిక పరిశోధనా సౌకర్యాలు, పని అవకాశాలు ఎక్కువగా ఉండటం, దీర్ఘకాలిక పోస్ట్ స్టడీ వీసా అవకాశాలు, గ్లోబల్ జాబ్ మార్కెట్, శాశ్వత నివాస వసతి, హార్వర్డ్, ఎమ్ఐటి, స్టాడోఫోర్డ్, ఆక్స్ ఫోర్డ్, కేంబ్రిడ్జ్ వంటి విశ్వవిద్యాలయాల్లో సాటిలేని విద్య, పరిశోధన అవకాశాలు అందిస్తుండటంతో భారతీయ విద్యార్థులు ఆకర్షితులవుతారు.నేడు భారతీయ విద్యార్థులు విదేశాలలో విద్యనభ్యసించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే విదేశాలలో విద్యావిధానం భారతదేశం కంటే ఎంతో అభివృద్ధి చెందింది.విదేశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు భారతదేశంలో విస్తృతంగా అందుబాటులో లేవు.విదేశాలలో విద్య వలన విద్యార్థులలో సామర్థ్యం పెంచుకోవడానికి ఒక సాధనంగా మారుతోంది. అలాగే విదేశాలలో ఉద్యోగావకాశాలు, ఆర్థికంగా అధిక మొత్తంలో వేతనాలు, విద్యార్థుల్ని విదేశీ విద్య, ఉద్యోగాల వైపు ఆలోచించేలా చేస్తున్నాయి.భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి ఎంపిక చేసుకునే ప్రధాన కారణాలు మూడు.
1. నాణ్యమైన విద్య భారతదేశంలోనూ విద్యా ప్రమాణాలు పెరుగుతున్నప్పటికీ అందుబాటులో ఉన్న కోర్సులు పరిమితంగా ఉంటున్నాయి. అవి కూడా కేవలం థియరీ వరకే పరిమితమవుతున్నాయి. ప్రాక్టికాలిటీ లోపించడం వలన, గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులకు ఉద్యోగానికి కావల్సిన నైపుణ్యాలు లేకపోవటం వలన కెరీర్ పరంగా ఆటంకాలు ఎదుర్కొంటున్నారు.మన దేశంలో విద్యను విదేశీ విద్యతో పోల్చి చూస్తే విదేశాలలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలు తమ విద్యార్థులను థియరీ, ప్రాక్టికాలిటీ మధ్య సమత్యులత ఉండేట్టు విద్యా విధానం ఉంటుంది.
This story is from the February 11, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 11, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![ఫోటో ఫీచర్](https://reseuro.magzter.com/100x125/articles/6074/1757659/ZDPpDNdx01720357157233/1720357571078.jpg)
ఫోటో ఫీచర్
ప్రపంచ వింతల్లో ఒకటి పెరూలోని మాచుపిచ్చు
![ఈ వారం 'కార్ట్యూ న్స్'](https://reseuro.magzter.com/100x125/articles/6074/1757659/2QcVP8Szq1720357045875/1720357144726.jpg)
ఈ వారం 'కార్ట్యూ న్స్'
ఈ వారం 'కార్ట్యూ న్స్'
![వారఫలం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1757659/nBchOQAx01720356703256/1720357054950.jpg)
వారఫలం
7 జులై నుండి 13, 2024 వరకు
![యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?](https://reseuro.magzter.com/100x125/articles/6074/1757659/p4HWm4CSQ1720356213538/1720356687668.jpg)
యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?
యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?
![నీకు లేరు సాటి...](https://reseuro.magzter.com/100x125/articles/6074/1757659/UoGwFzPdw1720355764795/1720356219630.jpg)
నీకు లేరు సాటి...
ఉద్యోగం గృహిణి లక్షణం అంటున్నారు విజ్ఞులైనవారు. గృహిణి అనగానే ఎడతెగని పనులు... ఇంటా బయటా ఎన్నో రకాల బాధ్యతలతో సతమతమవుతూ వున్నారు.
![అందాల ఉద్యానవనాలు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1757659/GgCNzkbg21720355051507/1720355773292.jpg)
అందాల ఉద్యానవనాలు
ఆఫ్రికాలో అనేక జాతీయ ఉద్యానవనాలు, అభయా రణ్యాలు, జంతువులు స్వేచ్ఛగా తిరిగే సఫారీలు ఉన్నాయి.
![పిల్లి తీర్చిన పిట్టపోరు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1757659/_WxXf-9TY1720352048111/1720352593479.jpg)
పిల్లి తీర్చిన పిట్టపోరు
సింగిల్ పేజీ కథ
![కృతజ్ఞత](https://reseuro.magzter.com/100x125/articles/6074/1757659/Z_yVZe4mJ1720351693529/1720352013514.jpg)
కృతజ్ఞత
‘కృతజ్ఞత' అనే సుగుణం గురించి ఎంతో గొప్పగా చెబుతోంది సుభాషితం.
![తెలుగు పది కాలాల పాటు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1757659/pg8dSob4N1720351447673/1720351688855.jpg)
తెలుగు పది కాలాల పాటు
సాహిత్యం
![నవ్వుల్...రువ్వల్...](https://reseuro.magzter.com/100x125/articles/6074/1757659/bZoxmlU801720350913476/1720351446900.jpg)
నవ్వుల్...రువ్వల్...
నవ్వుల్...రువ్వల్...