ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తారీకు నుంచి దసరా మొదలుకదా. అక్టోబరు 3 నుంచే ఎందుకు మొదలు అంటారా ఎందుకంటే ఆ రోజు ఆశ్వయుజ శుద్ధపాడ్యమి కనుక. అంటే ఈ రోజు అమ్మవారు ఆవిర్భవించిన రోజు గనుక. ఆ రోజునుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు ఆవిడ మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి అతనిని సంహరించింది.ఈ తొమ్మిది రోజులూ దేవీ నవరాత్రులని అమ్మవారిని పూజిస్తారు. పదవరోజు అమ్మవారు రాక్షసుడిని సంహరించిన విజయోత్సవ వేడుకలు విజయదశమిగా చేసుకుంటారు.
అంటే ఇది శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే పండుగ.అమ్మవారు ఆవిర్భవించింది అంటారు, వెంటనే రాక్షసుడిని చంపిందంటారు.. ఇదేమీ మాకర్థం కావటం లేదు, విపులంగా చెప్పండి అంటున్నారా. మర్చిపోయానర్రా, మీరంతా ఇంగ్లీషు మీడియాలు కదా, తెలుగు కథలు తెలియవులే. సరే, చెప్తా వినండి. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు వుండేవాడు. అతనికి మరణం లేని జీవనం కావాలనీ, ఎల్లకాలం తనే అన్నిలోకాలనూ పరిపాలించాలనీ గొప్ప కోరిక వుండేది. ఈ కాలంలో మనమంతా మంచి ఉద్యోగాలు సంపాదించటానికి బాగా చదివి, పరీక్షలెలా రాస్తున్నామో, ఆ కాలంలో ఏమన్నా సాధించాలంటే ఏళ్ల తరబడి దేవుళ్ల కోసం తపస్సు చేసి వరాలు పొందేవారు. మహిషాసురుడు కూడా తన కోరిక నెరవేర్చుకోవటానికి మేరుపర్వతం మీదకి వెళ్లి అనేక వేల సంవత్స రాలు బ్రహ్మదేవుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. కొన్నివేల సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. మహిషాసురుడు కోరుకున్నాడు. ఏమని? నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని. అప్పుడు బ్రహ్మదేవుడు, 'మహిషాసురా.. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.. గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చటం అసంభవం. కనుక, నిన్ను సంహరించ టానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకో' అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, 'విధాతా.. అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే.. ఆడది నా దృష్టిలో అబల.. ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక, పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా అనుగ్రహించు' అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.
This story is from the October 06, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 06, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ న్స్'
ఈ వారం కా'ర్ట్యూ న్స్'
డిసెంబరు 1 నుండి 7, 2024 వరకు
వారఫలం
నవ్వుల్...రువ్వుల్....
నవ్వుల్...రువ్వుల్....
మట్టే ఔషధం
దేవేంద్ర సభలో ఆ రోజున మహావిష్ణువు, దేవగురువు బృహస్పతి వున్నారు. స్వామివారు అసురులను వధించి మమ్మల్ని అమరావతిని పాలించేలా అనుగ్రహించారు.
వివేకంతో ఆలోచించాలి
అది వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలం. ఆ కాలంలో బోధిసత్త్వుడు సింహంలా జన్మించాడు. అడవిలో నివసించేవాడు.
పాత ఇంటిని కొనుగోలు చేస్తున్నారా?
వాస్తువార్త
అత్యాశ
అదృష్టాన్ని నమ్మేవారికి అత్యాశ అ రాసుకున్నది.. ఆశను త్యజించమన్నాడు బుద్ధుడు.
ఆంధ్రత్వం-ఆంధ్రభాష
తమిళనాట అడయపాలంలో 1520లో జన్మించిన సర్వతోముఖ సంస్కృత మహా \"విద్వాంసుడు అప్పయ్య దీక్షితులుకు, ఆంధ్రులన్నా, ఆంధ్రభాష అన్నా ప్రేమాభిమానాలుండేవి.
మేలైన ఆరోగ్యం కోసం..
పిల్లల్లో ఊబకాయం